పోలీస్ స్టేషన్‌లో కేటీఆర్ సిబ్బందిపై గుండాల దాడి దుర్మార్గం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: హైదరాబాద్

పీఆర్వో మహేష్, పీఏ మహేందర్‌రెడ్డిపై పోలీస్‌స్టేషన్‌లో గుండాలు చొరబడి దాడి చేయడాన్ని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్రంగా ఖండించారు. రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో రౌడీల రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు. ఈ ఘటనపై వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.