ఎమ్మిగనూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి: సీపీఎం డిమాండ్

రిపోర్టర్: AMPAIAH ACHARI స్థలం: ఎమ్మిగనూరు

ఎమ్మిగనూరు మండలాన్ని వెంటనే కరువు మండలంగా ప్రకటించి పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి అధికారులకు వినతిపత్రం అందజేశారు. వర్షాభావంతో ఎండిపోయిన పంటలకు ఎకరాకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ఈ సమస్యపై ఈ నెల పన్నెండో తేదీన కలెక్టరేట్ వద్ద జరిగే ఆందోళనలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.