పర్యావరణ హితంగా మట్టి వినాయకులను తయారు చేసిన దివ్యాంగ విద్యార్థులు

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల భవిత కేంద్రంలోని దివ్యాంగ విద్యార్థులు పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా మట్టి గణపతి ప్రతిమలను స్వయంగా తయారు చేసి తమ సృజనాత్మకతను చాటుకున్నారు. ప్లాస్టిక్ నివారించి మట్టి వినాయకులతో పండుగ జరుపుకోవాలని వారు పిలుపునిచ్చారు. అంతేకాకుండా కొందరు విద్యార్థులు రంగుల చిత్రపటాలు వేసి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకురాలు సంధ్యారాణి, కేర్ టేకర్ లక్ష్మి విద్యార్థులను అభినందించారు.