అనర్హత వేటుతో దానం నాగేందర్ వ్యవహారశైలిపై మంత్రులు గుర్రు
రిపోర్టర్: సునీల్
స్థలం: Hyderabad
ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యవహారశైలిపై రాష్ట్ర మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని రాజకీయ వర్గాలు వెల్లడించాయి. గతంలో తమను చులకనగా చూసిన ఆయన, అనర్హత వేటు పడి ఉపఎన్నిక అనివార్యమవడంతో ఇప్పుడు పనుల కోసం తమ చుట్టూ తిరుగుతున్నారని మంత్రులు మండిపడుతున్నట్లు సమాచారం. రూల్స్‌కు విరుద్ధంగా వ్యవహరిస్తూ తనను కలిసే అధికారులను కూడా గతంలో ఇబ్బంది పెట్టారని, ప్రస్తుతం ఆయన తీరులో స్పష్టమైన మార్పు వచ్చిందని పలువురు అధికారులు వాపోతున్నారు.