పరవాడ ఫార్మాసిటీ కాలుష్యంపై స్పందించి 95 పరిశ్రమలకు షోకాజ్ నోటీసులు

రిపోర్టర్: శివ స్థలం: అనకాపల్లి

అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో కాలుషిత నీరు ప్రవహిస్తోందంటూ సోషల్ మీడియాలో వచ్చిన వీడియోపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించడంతో, రంగంలోకి దిగిన పీసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. శుద్ధి చేయని వ్యర్థాలను కాలువల్లోకి వదులుతున్నట్లు గుర్తించి 95 పరిశ్రమలకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు.