వినాయక ఉత్సవాలకు సింగిల్ విండో అనుమతులు: ఎస్పీ

రిపోర్టర్: RAVI BABU స్థలం: వెదురుకుప్పం

వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో గణేష్ మండపాల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సింగిల్ విండో క్లియరెన్స్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. నిర్వాహకులు https://ganeshutsav.net వెబ్సైట్ ద్వారా ఎటువంటి రుసుము చెల్లించకుండానే సులభంగా అనుమతులు పొందవచ్చని జిల్లా ఎస్పీ తెలిపారు.

అప్లికేషన్ ఐడి ద్వారా పోలీస్, అగ్నిమాపక, విద్యుత్ శాఖల అనుమతులు ఒకే వేదికపై లభిస్తాయి. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి విగ్రహాలను మాత్రమే ప్రతిష్ఠించాలని, నిబంధనలను పాటిస్తూ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించాలని ఆయన కోరారు.