వినాయక ఉత్సవాల్లో భద్రతా నిబంధనలు: పోలీసుల హెచ్చరిక
రిపోర్టర్: RAVI BABU
స్థలం: వెదురుకుప్పం
వినాయక చవితి ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ అధికారులను ఆదేశించారు. నిమజ్జనం జరిగే ప్రదేశాల్లో గజ ఈతగాళ్లు, వైద్య సిబ్బంది, అగ్నిమాపక పరికరాలను సిద్ధం ఉంచాలని సూచించారు.
మండపాల వద్ద అగ్నిప్రమాదాలు జరగకుండా విద్యుత్ వైరింగ్‌ను నిపుణులతో చేయించాలి. రాత్రి 10 గంటల తర్వాత మైకులు వాడకూడదని, సోషల్ మీడియాలో వచ్చే రెచ్చగొట్టే వదంతులను నమ్మవద్దని, అత్యవసరమైతే డయల్ 112కు కాల్ చేయాలని ఎస్పీ సూచించారు.