విరాట్ కోహ్లీ ఆశ్రమ సందర్శన వివాదంపై తీవ్రంగా స్పందించిన అధికార ప్రతినిధి
రిపోర్టర్: కృష్ణ
స్థలం: న్యూఢిల్లీ
ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమాన్ని సందర్శించడానికి క్రికెటర్ విరాట్ కోహ్లీ డబ్బు తీసుకున్నాడంటూ వస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని ఆయన అధికార ప్రతినిధి బుధవారం స్పష్టం చేశారు. ప్రేమానంద్ మహారాజ్ పట్ల ఉన్న భక్తి విశ్వాసాలతోనే కోహ్లీ దంపతులు బృందావనం ఆశ్రమాన్ని సందర్శించారని తెలిపారు. ఫలాహారీ మహారాజ్ చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి వాస్తవం లేదని, కేవలం దుష్ప్రచారం మాత్రమే చేస్తున్నారని ప్రతినిధి ఒక ప్రకటనలో ఖండించారు.