బొబ్బిలి కోటలో తెలుగుదేశం పార్టీ శ్రేణుల ఆత్మీయ సమ్మేళనం

రిపోర్టర్: Bobbili GANESH స్థలం: బొబ్బిలి

విజయనగరం జిల్లా బొబ్బిలి కోటకు విచ్చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుకు ఎమ్మెల్యే బేబీనాయన ఆహ్వానం పలికారు. దర్బార్ మహల్ లో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు. మజ్జి శ్రీనివాసరావు చేరికపై కొంటె ప్రచారాలను ఎమ్మెల్యే ఖండించారు. ఎన్డీఏ కూటమి నాయకులంతా కలిసికట్టుగా పనిచేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తామని వారు స్పష్టం చేశారు.