విజయనగరం జిల్లాలో ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం

రిపోర్టర్: కిరణ్ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లా వ్యాప్తంగా జడ్పీటీసీ మరియు ఎంపీటీసీ ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఉద్యోగులు శుక్రవారం ఫెసిలిటేషన్ సెంటర్లలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు అధికారులు తెలిపారు. కలెక్టర్ ఎస్.రామ్ సుందర్ రెడ్డి ఆధ్వర్యంలో సాయంత్రం ఐదు గంటల వరకు పోటింగ్ కొనసాగిందని చెప్పారు. ఓటింగ్ ముగిసిన వెంటనే బ్యాలెట్ బాక్సులను కఠిన భద్రతా ప్రమాణాలతో సీల్ చేసి స్ట్రాంగ్ రూములకు తరలించి భద్రపరుస్తామని తహసీల్దార్ హేమంత్ కుమార్ స్పష్టం చేశారు.