బీజేపీ కార్యాలయాన్ని సందర్శించి నేతలతో చర్చించిన జిల్లా అధ్యక్షులు

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: ఎమ్మిగనూరు

ఎమ్మిగనూరు పట్టణంలోని బీజేపీ అసెంబ్లీ కార్యాలయాన్ని జిల్లా అధ్యక్షులు అక్కమతోట రామకృష్ణ, ఆదోని బిఎల్ఏ-1 రమేష్ యాదవ్ సందర్శించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి గురురాజ్ దేశాయ్ వారికి సాదర స్వాగతం పలికారు. రాబోయే స్థానిక ఎన్నికలు, పార్టీ కార్యకలాపాల విస్తరణపై నాయకులు సమగ్రంగా చర్చించారు. నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమాలోచనలు జరిపారు.