కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో అమితాబ్ బచ్చన్‌తో కమెడియన్ల సందడి

రిపోర్టర్: నరేష్ స్థలం: ముంబై

ప్రముఖ టెలివిజన్ క్విజ్ షో కౌన్ బనేగా కరోడ్‌పతి తాజా ఎపిసోడ్‌లో ప్రముఖ కమెడియన్లు వరుణ్ గ్రోవర్, గౌరవ్ కపూర్, గౌరవ్ గుప్తా సందడి చేశారు. సెప్టెంబర్ 18న ప్రసారమైన ఈ స్పెషల్ ఎపిసోడ్‌లో కమెడియన్లు అమితాబ్ బచ్చన్‌తో కలిసి పాత జ్ఞాపకాలను పంచుకున్నారు. కాలేజీ రోజుల్లో పీసీఓ నుంచి కేబీసీకి చేసిన కాల్స్, సూర్యవంశం సినిమాలోని ఖీర్ సీన్ గురించి సరదాగా మాట్లాడి అందరినీ నవ్విస్తూ అంతులేని వినోదాన్ని పంచారు.