ఈ నెల 18న రాజేంద్రప్రసాద్ పిఠాపురంలో అలా మొదలైంది విడుదల
రిపోర్టర్: రాజేష్
స్థలం: తెలంగాణ
సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో మహేష్‌చంద్ర దర్శకత్వంలో రూపొందిన ‘పిఠాపురంలో..అలా మొదలైంది’ చిత్రం ఈ నెల 18న ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా విడుదల కానుంది. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో యువతకు మంచి సందేశం అందించే ఈ చిత్రంలో సెంటిమెంట్‌తో పాటు చక్కటి వినోదం ఉంటుందని దర్శకుడు తెలిపారు. పృథ్వీరాజ్, కేదార్‌శంకర్, మణిచందన తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు జీసీ క్రిష్ సంగీతం అందించారు.