గుమ్మలక్ష్మీపురంలో సైకిల్ గుర్తుకు ఓటేయాలని అభ్యర్థి పద్మావతి పిలుపునిచ్చారు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: గుమ్మలక్ష్మీపురం
గుమ్మలక్ష్మీపురం మండలం కూటమి బలపరిచిన ఎంపీటీసి అభ్యర్థి బిడ్డిక పద్మావతి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. శనివారం సాయంత్రం డుమ్మంగి, కోసింగి భద్ర, సంధిగూడ తదితర గ్రామాల్లో పర్యటించి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ఆమెకు స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు.