తాగునీటి సంక్షోభంపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
రిపోర్టర్: వెంకట్
స్థలం: ఖమ్మం
రాష్ట్రంలో నీటి నిల్వలు తగ్గుతున్నాయని, భూగర్భ జలమట్టాలు పడిపోతున్నాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు. ఖమ్మంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని పంతొమ్మిది జిల్లాల్లో ముప్పై లక్షల యాభై ఆరు వేల ఎకరాల సాగుపై తీవ్ర ప్రభావం పడే పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో ప్రతి నీటి చుక్క అత్యంత విలువైనదని పేర్కొంటూ, ప్రాధాన్యతా క్రమంలో తాగునీటి అవసరాలకు నీటిని కేటాయిస్తామని వెల్లడించారు.