ఈసీ నిర్ణయాలపై రాహుల్ గాంధీ ధ్వజం: బీజేపీకి తొత్తుగా మారారని ఫైర్

రిపోర్టర్: రాము స్థలం: Andhra Pradesh

ఎన్నికల సంఘం తీరుపై ఏపీ కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. ఈసీ వ్యవహరిస్తున్న తీరు దేశద్రోహం కిందకే వస్తుందని AP Congress (INC) పేర్కొంది. ఎన్నికల సంఘంలో ముగ్గురు కమిషనర్లు ఉన్నప్పటికీ, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించింది. గడిచిన ఏడాది కాలంలోనే మిగతా కమిషనర్లకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఏకంగా పద్నాలుగు సార్లు ఏకపక్ష నిర్ణయాలు అమలు చేశారని ఏపీ కాంగ్రెస్ స్పష్టం చేసింది.