భోగాపురంలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. ఎనిమిది మందికి గాయాలు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లా భోగాపురం మండలం రాజాపులోవ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖ నుంచి శ్రీకాకుళం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న టిప్పర్ను వేగంగా వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా, మరో ఏడుగురు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.