రాప్తాడు విద్యార్థినిని పరామర్శించనున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి: మణిపాల్ ఆస్పత్రికి వెళ్లనున్న మాజీ సీఎం

రిపోర్టర్: అశోక్ స్థలం: అనంతపురం

అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన దారుణ దాడిలో తీవ్రంగా గాయపడి బెంగళూరు మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినిని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మధ్యాహ్నం ఆస్పత్రికి చేరుకుని బాలిక ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుంటారని, బాధిత కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెబుతారని తెలిపారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.