'మా కుమార్తెలను హత్య చేశారు': అనంతపురంలో తల్లిదండ్రుల ఆరోపణలు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: అనంతపురం

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం రోటరీపురంలో జరిగిన కారు ప్రమాదంలో ఇద్దరు యువతులు మృతి చెందగా, ఇద్దరు యువకులు గాయపడ్డారు. గుత్తికి చెందిన హరిత, తాడిమర్రికి చెందిన నవనీత మృతి చెందగా, కారు నడిపిన శ్రీధర్‌రెడ్డి, కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. యువకులే తమ కుమార్తెలను మాయమాటలతో తీసుకెళ్లి హత్య చేసి, ప్రమాదంగా చిత్రీకరించారంటూ మృతుల తల్లిదండ్రులు సాలమ్మ, విజయ ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.