స్థానిక సంస్థల ఎన్నికల సమరం: చంద్రబాబుతో జనసేన నేతల కీలక భేటీ

రిపోర్టర్: గోపి స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్లో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై తెలుగు దేశం, జనసేన పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కసరత్తు వేగవంతమైందని సీఎం చంద్రబాబు నాయుడుతో జరిగిన భేటీలో స్పష్టమైందని నేతలు తెలిపారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పోటీ చేసే స్థానాలు, అభ్యర్థుల ఎంపికపై ఇరు పార్టీల మధ్య కీలక చర్చలు జరిగాయని, త్వరలోనే స్పష్టత వస్తుందని అధికారులు వెల్లడించారు.