రాజధాని ఆలయాల్లో రూ.7.26 కోట్ల నిధుల దుర్వినియోగం

రిపోర్టర్: రమేష్ స్థలం: గుంటూరు

రాజధాని ప్రాంతంలోని 49 ఆలయాల్లో గత పదేళ్లలో రూ.7.26 కోట్ల నిధులు స్వాహా అయ్యాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్లు, కౌలు సొమ్మును ఈవోలు, ఉద్యోగులు కాజేస్తుంటే, ఉన్నతాధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఆడిట్ శాఖ 6371 అభ్యంతరాలు వ్యక్తం చేసినా చర్యలు లేకపోవడం గమనార్హం. మంగళగిరి, తుళ్లూరు మండలాల్లోని పలు ఆలయాల్లో ఈ అక్రమాలు వెలుగుచూశాయి. నిధుల దోపిడీపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.