మర్రిపాడులో ఎస్సీ, ఎస్టీ కమిటీల ఎంపిక: పేదరికంపై పోరాటమే లక్ష్యమన్న రఘు
రిపోర్టర్: Darsigunta Naveen
స్థలం: మర్రిపాడు
మర్రిపాడు మండల కేంద్రంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పరిరక్షణ కమిటీ మండల మరియు పంచాయతీ నూతన కమిటీలను ఘనంగా ఎంపిక చేశారు. జిల్లా అధ్యక్షురాలు జయశ్రీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కొప్పాల రఘు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహనీయుడు ఎస్.ఆర్ శంకరన్ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణే తమ ప్రధాన ధ్యేయమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.