కోల్‌కతాలో భారీ పేలుడు, నివాస గృహం ధ్వంసం

రిపోర్టర్: రాజేష్ స్థలం: పశ్చిమ బెంగాల్

పశ్చిమ బెంగాల్‌లోని బరూయిపూర్‌లో భారీ పేలుడు సంభవించి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. గ్యాస్ సిలిండర్ పేలుడు వల్ల ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే, ఇంట్లో బాంబులు దాచిపెట్టారంటూ బీజేపీ, సీపీఎం వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి ఫోరెన్సిక్ బృందంతో దర్యాప్తు జరుపుతున్నారు.