తెలంగాణలో రూ. 70 వేల కోట్లతో భారీ ఏఐ డేటా సెంటర్

రిపోర్టర్: విజయ్ స్థలం: హైదరాబాద్

తెలంగాణలో రూ. 70,000 కోట్ల పెట్టుబడితో దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో 250 ఎకరాల్లో నిర్మించే ఈ ప్రాజెక్టుతో 7,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. 2028 జూన్ 2 నాటికి ఈ కేంద్రాన్ని పూర్తి చేయాలని సీఎం గడువు విధించారు. ఫ్యూచర్ సిటీ రోడ్డును రతన్ టాటాకు అంకితం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.