కడుపు నొప్పితో అధిక మోతాదులో మాత్రలు మింగి యువతి మృతి
రిపోర్టర్: శివ
స్థలం: విజయనగరం
అనారోగ్యంతో బాధపడుతూ అధిక మోతాదులో మాత్రలు మింగిన యువతి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపారు. విజయనగరం జిల్లా గజపతినగరం మండలం డోలపాలేనికి చెందిన వి.దేవి కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతోంది. ఈనెల 25న ఇంట్లో ఉన్న ఐరన్ మాత్రలు ఎక్కువ మొత్తంలో మింగడంతో కుటుంబసభ్యులు ఆమెను విజయనగరం జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 26న ప్రాణాలు కోల్పోయింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.