బాసర ట్రిపుల్ ఐటీలో నీటి సరఫరాపై కలెక్టర్ భవేశ్ మిశ్రా సమీక్ష

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: నిర్మల్

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ఎలాంటి నీటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా స్పష్టం చేశారు. సోమవారం ఆయన ట్రిపుల్ ఐటీని సందర్శించి నీటి సరఫరాను పరిశీలించారు. అలాగే భూముల రీసర్వే ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని ఆదేశించారు. వివిధ మండలాల్లో ఆయకట్టు పంటలను పరిశీలించి రైతులకు సాగునీరు అందేలా చర్యలు చేపడతామని కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు.