పాలకొండ: అమర నాగలింగేశ్వర స్వామి ఆలయానికి రూ.1.80 లక్షల ఆభరణాల విరాళం
రిపోర్టర్: సతీష్
స్థలం: పాలకొండ
పాలకొండ మండలం అంపిలి గ్రామంలో కొలువైన అమర నాగలింగేశ్వర స్వామి వారి ఆలయానికి రూ.1,80,000 విలువైన నాగాభరణం, మకరతోరణాన్ని మార్క్ఫెడ్ డైరెక్టర్ ఆనెపు రామకృష్ణ మరియు శ్రీదేవి దంపతులు భక్తిశ్రద్ధలతో కానుకగా అందించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం దంపతులను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా శాలువా కప్పి సత్కరించారు.