కేరళలోని మున్నార్‌లో అద్భుతంగా నీలకురింజి పూల వికసనం

రిపోర్టర్: రాము స్థలం: Kerala

కేరళలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం మున్నార్‌లో అరుదైన నీలకురింజి పూలు కనువిందు చేస్తున్నాయి. కొరందక్కాడ్, చొక్రముడి కొండల్లో ఇవి భారీగా పూశాయి. 12 సంవత్సరాలకోసారి పూసే ఈ నీలిమందు పూల శోభను తిలకించడానికి పర్యాటకులు పోటెత్తుతున్నారు. విభిన్న ప్రాంతాల్లో వేర్వేరు సమయాల్లో పూసే ఈ జాతి పూలు ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.