రంగానాయుడుపల్లిలో వైభవంగా మొదలైన రామాలయ విగ్రహ ప్రతిష్టోత్సవాలు

రిపోర్టర్: UserK BALAYESU స్థలం: సీతారామపురం

సీతారామపురం మండలంలోని రంగానాయుడుపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ కోదండ రామస్వామి వారి దేవాలయ ప్రారంభోత్సవ, విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. నవంబర్ మూడు నుండి ఐదు వరకు మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు, హోమాలు, జపాలు నిర్వహిస్తున్నారు. నవంబర్ ఐదున మహాకుంభాభిషేకం, స్వామి వారి కళ్యాణంతో పాటు ప్రతిరోజు భక్తులకు అన్నప్రసాద వితరణ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.