బీసీ రిజర్వేషన్లపై చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారు: మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్
రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు
స్థలం: నర్సీపట్నం
బీసీ రిజర్వేషన్ల అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను మభ్యపెడుతూ రాజకీయ నాటకాలు ఆడుతున్నారని నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రిజర్వేషన్లు యాభై శాతానికి మించరాదని సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నప్పటికీ, ముప్పై నాలుగు శాతం అమలు చేస్తున్నామంటూ జీవో 105తో ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. గతంలోనే వైఎస్ జగన్ ప్రభుత్వం జీవో 176 ద్వారా బీసీలకు ప్రాధాన్యం కల్పించిందని ఆయన మీడియా సమావేశంలో గుర్తుచేస్తూ స్పష్టం చేశారు.