పరుగుల పందెంలో ప్రతిభ చాటి స్వర్ణం సాధించిన ములుగు విద్యార్థి
రిపోర్టర్: Mulugu News
స్థలం: ములుగు
ములుగు మండలంలోని బండారుపల్లి పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ జూనియర్ కళాశాల విద్యార్థి గుడెల్లి బాచి దక్షిణ భారత జోనల్ స్థాయి అథ్లెటిక్స్ పోటీలలో అద్భుత ప్రతిభ కనబరిచారు. పుదుచ్చేరిలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన వెయ్యి మీటర్ల మిడ్లే రిలే పరుగు పందెంలో ఆయన గోల్డ్ మెడల్ సాధించారు. ఈ ఘనత సాధించడం పట్ల పాఠశాల ప్రిన్సిపల్ సింగారం దేవకి, అధ్యాపకులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.