ఘోరం: విద్యార్థినులను లైంగికంగా వేధించిన ఉపాధ్యాయుడు సస్పెండ్
రిపోర్టర్: అశోక్
స్థలం: గరివిడి
గరివిడి మండలంలోని గదబవలస ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న ముగ్గురు బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఉపాధ్యాయుడు పెంకి బాబ్జిని జిల్లా విద్యాశాఖాధికారి సస్పెండ్ చేసినట్లు ఎంఈవో రామారావు తెలిపారు. విద్యార్థినుల తల్లిదండ్రులు, గ్రామస్థులు పోలీసులకు, విద్యాశాఖాధికారులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు పాఠశాలను సందర్శించి వివరాలు సేకరించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించామని, శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.