గొలగమూడిలో టీడీపీ నేత సతీమణి భౌతికకాయానికి ఎమ్మెల్యే సోమిరెడ్డి ఘన నివాళి

రిపోర్టర్: సాయి దివ్య స్థలం: వెంకటాచలం

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం గొలగమూడిలో ఇటీవల మృతిచెందిన టీడీపీ నేత పాకాల శ్రీనివాసులు సతీమణి రాజేశ్వరమ్మ భౌతికకాయానికి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబసభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాజేశ్వరమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని ఆయన ప్రత్యేకంగా ప్రార్థించారు.