ఏలూరు గంగానమ్మ ఆంథమ్ ఆవిష్కరణ: భక్తులను ఆకట్టుకుంటున్న ప్రత్యేక భక్తి గీతం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: ఏలూరు

ఏలూరు గ్రామదేవత శ్రీ గంగానమ్మ తల్లి వైభవాన్ని చాటిచెబుతూ రూపొందించిన ఏలూరు గంగానమ్మ ఆంథమ్ మ్యూజిక్ వీడియో యూట్యూబ్లో విశేష ఆదరణ పొందుతోందని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. సుమారు నూట యాభై ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ జాతర కోసం తొలిసారిగా ప్రత్యేకంగా రూపొందించిన ఈ భక్తి గీతాన్ని మంత్రి ఆవిష్కరించి చిత్ర బృందాన్ని అభినందించారు. ప్రాంతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ పాటను తెరకెక్కించడం సంతోషకరమని పేర్కొన్నారు.