స్వచ్ఛాంధ్ర లక్ష్యంగా కీలక అడుగు: ఐఐటీ కాన్పూర్తో ప్రభుత్వం ఒప్పందం

రిపోర్టర్: గోపి స్థలం: అమరావతి

స్వచ్ఛతకు మహాత్మా గాంధీ అత్యధిక ప్రాధాన్యమిచ్చారని సీఎం చంద్రబాబు వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణ కోసం రాష్ట్రంలో నెట్ జీరో సాధనకై ఐఐటీ కాన్పూర్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ మధ్య కీలక అవగాహన ఒప్పందం కుదిరినట్లు ఆయన తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానంతో వ్యర్థాల నిర్వహణను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ భాగస్వామ్యం దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రతి నెలా మూడో శనివారం స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఉద్యమంగా ముందుకు తీసుకెళ్తున్నామని, పరిశుభ్రత ప్రతి పౌరుడి బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.