కొండా సురేఖపై బస్వరాజు సారయ్య సంచలన సవాల్
రిపోర్టర్: మహేష్
స్థలం: వరంగల్
మంత్రి పదవి నుంచి తొలగింపుపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. తనపై ఫిర్యాదు చేసింది తానేనని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య స్పష్టం చేశారు. దమ్ముంటే రాజీనామా చేసి ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని సురేఖకు ఆయన సవాల్ విసిరారు. బ్లాక్ మెయిల్ కల్చర్ మీదేనని, సీఎంను విమర్శిస్తే సహించేది లేదని సారయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వరంగల్ కాంగ్రెస్ వర్గాల్లో ఈ వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.