కళ్యాణదుర్గంలో కూటమి అభ్యర్థుల భారీ గెలుపే లక్ష్యంగా దేవినేని ధర్మతేజ ప్రచార హోరు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: కళ్యాణదుర్గం

కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని టీడీపీ నాయకుడు దేవినేని ధర్మతేజ శెట్టూరు మండలంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు గ్రామాల్లో పర్యటించి సైకిల్ గుర్తుకు ఓటేయాలని ఓటర్లను కోరారు. మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా కూటమి పనిచేస్తుందని, కార్యకర్తలు సమన్వయంతో విజయం సాధించాలని ఆయన పిలుపునిచ్చారు.