యువతలో పెరుగుతున్న గుండెపోటు ముప్పుపై డాక్టర్ నరేష్ త్రెహన్ ఆందోళన
రిపోర్టర్: రాజేష్
స్థలం: హైదరాబాద్
దేశంలో యువతలో గుండెపోటు ముప్పు తీవ్రంగా పెరుగుతోందని పద్మభూషణ్ డాక్టర్ నరేష్ త్రెహన్ వెల్లడించారు. జన్యుపరమైన కారణాలు, ఒత్తిడి, మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల గుండె జబ్బులు సైలెంట్ కిల్లర్‌గా మారుతున్నాయని ఆయన హెచ్చరించారు. అజీర్తి, గ్యాస్ సమస్యలను తేలికగా తీసుకోరాదని, ఛాతిలో వచ్చే చిన్న మార్పులను కూడా గమనించాలని సూచించారు. వ్యక్తిగత ఆరోగ్య హొరోస్కోప్ ద్వారా ముందుగానే ప్రమాదాలను గుర్తించవచ్చని ఆయన పేర్కొన్నారు.