నాలో ఇంకా క్రికెట్ ఆడే కసి తగ్గలేదు: మహమ్మద్ షమీ

రిపోర్టర్: సునీల్ స్థలం: Chennai

అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నప్పటికీ తనలో ఉత్సాహం, కసి ఎక్కడా తగ్గలేదని టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ స్పష్టం చేశారు. దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ విజయం సాధించడం, తన వందవ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడటం ఎంతో సంతృప్తినిచ్చిందని తెలిపారు. ఏ స్థాయిలో ఆడినా దేశం కోసం పూర్తి అంకితభావంతో పోరాడుతానని షమీ వెల్లడించారు.