'బస్సులు సరిపడా లేక తీవ్ర యాతన': విజయనగరం ప్రయాణికుల ఆవేదన

రిపోర్టర్: రాము స్థలం: విజయనగరం

విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బస్సుల కొరతతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. జిల్లాలో విజయనగరం, ఎస్‌.కోట డిపోల పరిధిలో సరిపడా బస్సులు లేకపోవడంతో సమయానికి రాక, వచ్చినా రద్దీతో ప్రయాణం నరకప్రాయంగా మారుతోంది. నిత్యం వేలాది మంది ప్రయాణికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కొత్త బస్సుల ఏర్పాటుపై అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ సమస్యపై జిల్లా ప్రజా రవాణా అధికారిణి వరలక్ష్మి స్పందిస్తూ కొత్త విద్యుత్తు బస్సుల కోసం ప్రతిపాదనలు పంపామని తెలిపారు.