స్వయంభు నుంచి సంయుక్త మీనన్ వీరనారి టీజర్ విడుదల

రిపోర్టర్: రమేష్ స్థలం: హైదరాబాద్

నిఖిల్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'స్వయంభు'. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ప్రత్యేక టీజర్ విడుదల చేశారు. వీరనారి పాత్రలో కత్తి యుద్ధాలు చేస్తూ సంయుక్త కనిపించిన ఈ 40 సెకళ్ల యాక్షన్ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ సినిమాపై భారీ అంచనాలను పెంచుతోంది.