సెప్టెంబర్‌లో ఐకూ 16 స్మార్ట్‌ఫోన్ విడుదల?

రిపోర్టర్: కిరణ్ స్థలం: India

అత్యాధునిక ఫీచర్లతో ఐకూ 16 స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్‌లో మార్కెట్లోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇందులో శక్తివంతమైన క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్, 2కే రిజల్యూషన్ కలిగిన సామ్‌సంగ్ డిస్‌ప్లే, ప్రత్యేక గేమింగ్ చిప్ అమర్చినట్లు సమాచారం. అలాగే 8,400 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో పాటు ట్రిపుల్ కెమెరా వ్యవస్థను కలిగి ఉండే అవకాశం ఉంది.