కావలిలో భూ ఆక్రమణలపై దివ్యాంగ కాలనీ వాసుల నిరసన: తహసీల్దార్‌కు వినతి
రిపోర్టర్: శివ
స్థలం: నెల్లూరు
కావలి పట్టణంలోని దివ్యాంగ కాలనీలో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ ప్రత్యేక ప్రతిభావంతులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం నిరసన చేపట్టారు. తమ కాలనీలో పలువురు వీఆర్ఏలు ఆక్రమణలకు పాల్పడుతున్నారని దివ్యాంగ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మండవ వెంకట్రావు ఆరోపించారు. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా తహసీల్దార్ శ్రవణ్ కుమార్‌కు బాధితులు వినతి పత్రం అందజేయగా, పూర్తి స్థాయి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హామీ ఇచ్చారు.