గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ఊరట: స్థిరంగా కొనసాగుతున్న ఎల్పీజీ ధరలు

రిపోర్టర్: శివ స్థలం: హైదరాబాద్

నవంబర్ మొదటి తేదీన గ్యాస్ సిలిండర్ ధరల్ లో ఎలాంటి మార్పు లేదని చమురు కంపెనీలు వెల్లడించాయి. గత నెలలో కమర్షియల్ సిలిండర్ ధరలు పెరిగినప్పటికీ, ఈసారి గృహ వినియోగ అలాగే వాణిజ్య సిలిండర్ల రేట్లు స్థిరంగా ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్ లోని ప్రధాన నగరాల్ లో పాత ధరలే కొనసాగుతుండటంతో మధ్యతరగతి కుటుంబాలకు కొంతమేర ఊరట లభించినట్లయింది.