చిల్లకూరు మండలం రైతుల విద్యుత్ సమస్యను పరిష్కరించాలని సునీల్ కుమార్ హామీ
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం పరిధిలోని చిల్లకూరు మండలం ఓడూరు పంచాయతీలో ఇరవై ఏళ్లుగా నిమ్మ సాగు చేస్తున్న రైతులు విద్యుత్ సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పాశం సునీల్ కుమార్ తెలిపారు. రైతుల విజ్ఞప్తి మేరకు విద్యుత్ సమస్యను పరిశీలించి, తక్షణమే పరిష్కారానికి తగిన కృషి చేస్తానని ఆయన వారికి భరోసా ఇస్తూ హామీ ఇచ్చారు.