నవి ముంబైలో భారీ సైబర్ మోసం: రూ. 1.60 కోట్లు కాజేసిన ఐదుగురు
రిపోర్టర్: సతీష్
స్థలం: Navi Mumbai
నవి ముంబైలోని ఖర్ఘర్ లో సిడ్కో ఫ్లాట్ల పేరుతో రవాణా వ్యాపారి సత్యపాల్ శ్రీనివాస్ శర్మను మోసగించిన ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. తక్కువ ధరకే ఫ్లాట్లు ఇస్తామంటూ నమ్మించి నిందితులు నకిలీ పత్రాలు సృష్టించి కోటీ అరవై లక్షల రూపాయలు వసూలు చేశారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. మోసం బయటపడిన తర్వాత నిందితులు తనను బెదిరించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.