షాకింగ్ ఘటన: పన్నెండో అంతస్తు కిటికీ గ్రిల్స్‌లో ఇరుక్కుపోయిన చిన్నారి
రిపోర్టర్: రాజేష్
స్థలం: Zhangping
చైనాలోని ఫుజియాన్ ప్రావిన్స్‌లోని జాంగ్‌పింగ్ నగరంలో తీవ్ర కలకలం రేపిన ఈ ఘటనలో మూడేళ్ల చిన్నారి పన్నెండో అంతస్తు కిటికీ గ్రిల్స్‌లో ఇరుక్కుపోయి ప్రాణాపాయ స్థితిలో వేలాడింది. అప్రమత్తమైన స్థానికులు, భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి కింద అంతస్తు నుండి స్టూల్ సాయంతో చిన్నారిని పైకి పట్టుకుని ప్రాణాలు కాపాడినట్లు అధికారులు తెలిపారు. పోలీసులు మరియు అగ్నిమాపక సిబ్బంది తక్షణమే అక్కడికి చేరుకుని తలుపులు పగలగొట్టి చిన్నారిని సురక్షితంగా కిందకు దించి ఆసుపత్రికి తరలించారు.