టీఎస్ఆర్టీసి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు గుర్తుల కేటాయింపు పూర్తి
రిపోర్టర్: గోపి
స్థలం: తెలంగాణ
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల ప్రక్రియ వేగవంతమైందని రిటర్నింగ్ అధికారి తెలిపారు. సీక్రెట్ బ్యాలెట్ విధానంలో జరిగే ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్న పన్నెండు కార్మిక సంఘాలకు ఎన్నికల గుర్తులను కేటాయించినట్లు పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు టీఎంయూకు అనుమతినిచ్చామని వెల్లడించారు. గుర్తుల కేటాయింపు పూర్తి కావడంతో నేతలు ప్రచారానికి సమాయత్తమవుతున్నారని, అక్టోబర్ తొమ్మిదో తేదీన పోలింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.