వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు నాంపల్లి సీబీఐ కోర్టు అనుమతి

రిపోర్టర్: శివ స్థలం: హైదరాబాద్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు హైదరాబాద్‌లోని నాంపల్లి ప్రత్యేక సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అక్టోబర్ 1 నుండి నవంబర్ 30 మధ్య కాలంలో 15 రోజుల పాటు యూరప్ దేశాలలో పర్యతించేందుకు న్యాయస్థానం అనుమతి మంజూరు చేసింది. అయితే పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్, బస చేసే ప్రాంతాలు, ఫోన్ నంబర్ వివరాలను సీబీఐ అధికారులకు సమర్పించాలని కోర్టు కఠిన షరతులు విధించింది.