ప్రాణభయంతోనే నేరడిగొండ జాతీయ రహదారి దాటుతున్న స్థానికులు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Adilabad

ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రం నడిబొడ్డు నుంచి వెళ్లే జాతీయ రహదారిపై రాకపోకలు సాగించడం స్థానికులకు ప్రాణసంకటంగా మారుతోందని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. హైవేకు ఇరువైపులా నివాస ప్రాంతాలు, బస్టాండ్, తహశీల్దార్ కార్యాలయం ఉండడంతో నిత్యం వేలాది మంది రోడ్డు దాటేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అమిత వేగంతో దూసుకువచ్చే భారీ వాహనాల వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, అధికారులు స్పందించి వడ్డూర్ బ్రిడ్జి నుంచి పోలీస్స్టేషన్ వరకు ఫ్లైఓవర్ నిర్మించి శాశ్వత పరిష్కారం చూపాలని వారు కోరారు.